NTV Telugu Site icon

India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..

Canada Vs India

Canada Vs India

India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా కెనడా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే, కెనడా ప్రధాని జస్టిన ట్యూడోపై సంచనల వ్యాఖ్యలు చేశారు. కెనడా-ఇండియా మధ్య దౌత్యవివాదానికి నిందించారు. భారతదేశంలో ట్రూడోని చూసి నవ్వుకుంటున్నారని, భారత్ లో ఆయన ‘లాఫింగ్ స్టాక్’గా మారారని ఆయన అన్నారు. నేపాలీ మీడియా సంస్థ నమస్తే రేడియో టొరంటోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘భారతదేశంలో ట్రూడో ఒక లాఫింగ్ స్టాక్ గా పరిగణించబడుతున్నారు-ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం’’ అని ఆయన అన్నారు.

Read Also: Tiger Nageswararao :టైగర్ నాగేశ్వరరావు టూ డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

కెనడియన్ దౌత్యవేత్తలను దేశం విడిచిపెట్టి వెళ్లమని భారత్ కోరడంపై స్పందిస్తూ.. ట్రూడో అసమర్థుడు, అన్ ప్రొఫెషనల్ అంటూ దుయ్యబట్టారు. కెనడా ఇప్పుడు భారత్ తోనే కాకుండా ప్రపంచంలోని ప్రధాన శక్తులతో తగాదాలు పెట్టుకుందని ఆయన అన్నారు. తాను కెనడా ప్రధాని అయితే భారత్ తో సంబంధాలు పునరుద్ధరిస్తానని అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తి, ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉండటం అవసరం అని ఆయన అన్నారు. కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పియరీ తెలిపారు.

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని జూన్ నెలలో కెనడాలో గుర్తుతెలియని వ్యక్తుల చంపేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కిరించారు. భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత్ విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ లోని 41 మంది కెనడా దౌత్వేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కెనడాను కోరింది. లేకపోతే వారికున్న రక్షణలను తొలగిస్తామని హెచ్చరించింది. చేసేందేం లేక కెనడా తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది.