Site icon NTV Telugu

India-Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం.. ఇదొక మైలురాయి అన్న మోడీ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది కేవలం 70 సంవత్సరాల వేడుక మాత్రమే కాదు. ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి.’’ అని మోడీ ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

‘‘సముద్రం రెండు చివర్ల చాలా దూరంలో ఉంటాయని.. అయితే అరేబియా సముద్రం మాండవి.. మస్కట్‌ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను.. సంస్కృతిని, ఆర్థిక వ్యవవస్థను బలోపేతం చేసింది. ఈరోజు పూర్తి విశ్వాసంతో చెప్పగలం. సముద్రపు అలలు.. వాతావరణం మారినప్పటికీ.. భారతదేశం-ఒమన్ మధ్య స్నేహం ప్రతి అలతో పాటు మరింత బలపడుతోంది.’’ అని అన్నారు.

మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని మోడీ సోమవారం జోర్డాన్ వెళ్లారు. అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఇథియోపియాకు వెళ్లారు. అక్కడ కూడా గౌరవ మర్యాదలు దక్కాయి. ప్రస్తుతం ఒమన్‌లో పర్యటిస్తున్నారు. మూడు దేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: TheRajaSaab : నిధి అగర్వాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

బుధవారం ఒమన్‌ చేరుకోగానే ఉప ప్రధాని సయ్యిబ్‌ షిహాబ్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయిద్‌తో మోడీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్‌-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు.

 

 

 

Exit mobile version