NTV Telugu Site icon

Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

Usa

Usa

Anti-Semitism: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్ధులు పాలస్తీనా-హమాస్‌కి మద్దతుగా బహిరంగంగా మద్దతు తెలపడంతో పాటు యూదు విద్యార్ధులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి కొందరు లిబరల్స్ అని చెప్పుకునే వర్సిటీ టాప్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. ఇలా పలు వర్సిటీల్లో యూదు వ్యతిరేకత పెరగడంతో యూఎస్ కాంగ్రెస్ విచారణ చేసింది.

కాంగ్రెస్ విచారణ తర్వాత విమర్శల నేపథ్యంలో ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. యూనివర్సిటీ పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ ఎలిజబెత్ మాగిల్ కూడా స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారని యూనివర్సిటీ ట్రస్టీ బోర్డు చైర్ స్కాట్ బోక్ ప్రకటించారు. క్యాంపస్ స్టూడెంట్ వార్తాపత్రిక అయిన డైలీ పెన్సిల్వేనియన్ ప్రకారం, బోక్ తన పదవికి రాజీనామా చేశాడు.

మంగళవారం క్యాంపస్ యాంటీ-సెమిటిజంపై కాంగ్రెస్ విచారణ సందర్భంగా వారి వాంగ్మూలాలను తీసుకున్నారు. ఇందులో అమెరికా ఎలైట్ యూనివర్సిటీల్లోని ముగ్గురు అధ్యక్షుల్లో మాగిల్ కూడా ఉన్నారు. తమ క్యాంపస్‌లలో ‘‘యూదుల మారణహోమానికి’’ పిలుపునిచ్చేలా విద్యార్థులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారా..? విచారణ సమయంలో ప్రశ్నించారు. అయితే ముగ్గురు వర్సిటీ అధికారులు తప్పించుకునేలా సమాధానాలు ఇచ్చారు. దీంతో వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Rajasthan: రాజస్థాన్‌లో మోడీ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.. వసుంధర రాజే లేదా ఓం మాథుర్?

విచారణ తర్వాత 74 మంది చట్టసభ సభ్యులు మాగిల్, హార్వర్డ్, మసాచుసెట్స్ యూనివర్సిటీల అధ్యక్షులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖలు రాశారు. హర్వర్డ్ ప్రెసిడెంట్ క్లాడిన్ గే, ఆమె క్యాంపస్‌లో జరుగుతున్న యాంటి సెమిటిక్ కార్యకలాపాలను, హింసను, బెదిరింపులను ఖండించడంలో విఫలమైనందుకు క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ ఎలిజబెత్ మాగిల్ మరిన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే యూనివర్సిటీల్లో యూదులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం, వీటిని ఆయా వర్సిటీ ప్రెసిడెంట్లు చూసీచూడకుండా వ్యవహరించడం పట్ల యూదులు ఆగ్రహంగా ఉన్నారు. పలు వర్సిటీలకు వీరు లక్షల డాలర్లు విరాళంగా ఇస్తున్నారు. ఇలా యాంటీ సెమిటిజం కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వారు తమ విరాళాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వారిపై విచారణ జరిగి, బాధ్యులైన ప్రెసిడెంట్లను రాజీనామా చేయాల్సిందిగా కోరింది.