Site icon NTV Telugu

అమెరికా మ‌రో హెచ్చ‌రిక‌: మానవ బాంబులు, రాకెట్లతో దాడి

అమెరికాతో పాటుగా అనేక అగ్ర‌రాజ్యాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించాయి.  అలా హెచ్చ‌రించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే దాడులు జ‌రిగాయి.  అంటే అక్క‌డ సెక్యూరిటి ఏ విధంగా ఉన్న‌దో అర్ధం చేసుకోవ‌చ్చు.  తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల త‌రువాత ఆ దేశం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.  ప్ర‌స్తుతం తాలిబ‌న్ ఫైట‌ర్లు మాత్ర‌మే భ‌ద్ర‌తా సంబంధ‌మైన విధులు నిర్వ‌హిస్తున్నారు.  పోలీసు, సైనికులు ఇంకా విధుల్లోకి రాలేదు.  దీంతో భ‌ద్ర‌తా ప‌ర‌మైన లోపాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి.  అగ్రదేశాల నిఘాచారాన్ని తాలిబ‌న్లు ప‌ట్టించుకోక‌పోయి ఉండొచ్చు.  లేక మ‌రేదైనా కావొచ్చు.  కానీ ఫ‌లితం మాత్రం దారుణంగా ఉన్న‌ది.  ఐసిస్ కే దాడిలో 100 మందికి పైగా మృతి చెంద‌గా, 200 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.  ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ జ‌న‌ర‌ల్ ఫ్రాంక్ మెకంన్జీ పేర్కొన్నారు.  ఈసారి ఉగ్ర‌వాదులు రాకెట్లు, వాహ‌న‌బాంబుల‌తో ఎయిర్‌పోర్ట్ ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు.  ఎయిర్ పోర్ట్ బ‌య‌ట ఉన్న వ్యక్తుల‌తో పాటుగా ఎయిర్‌పోర్ట్ లోప‌ల ఉన్న‌వారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.  

Read: ఆఫ్ఘ‌న్‌లో ఆహార సంక్షోభం… ప్రతి ముగ్గురిలో ఒకరు…

Exit mobile version