Site icon NTV Telugu

ఒకప్పుడు ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్ష‌ణ పొందిన‌ వ్యక్తి…ఇప్పుడు తాలిబ‌న్ అగ్రనేతగా మారాడా..!!

ఇప్పుడు ఎవరినోట విన్నా తాలిబ‌న్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు.  తాలిబ‌న్ల అరాచ‌కాల గురించి చ‌ర్చించుకుంటున్నారు.  ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో తాలిబ‌న్లు ఎలా ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకుంటున్నారో తెలుసుకొని భ‌య‌ప‌డుతున్నారు.  ఇక్క‌డున్న మ‌న‌మే ఇంత‌లా భ‌య‌ప‌డుతుంటే, ఇక ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న ప్ర‌జ‌లు ఎంత భ‌య‌ప‌డుతున్నారో ఆర్ధం చేసుకోవ‌చ్చు.  తాలిబ‌న్‌లో కీల‌క‌మైన వ్య‌క్తుల్లో షేర్ మొహ్మ‌ద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ కూడా ఒక‌రు.  ఆయ‌న 1982లో ఆఫ్ఘ‌న్ సైన్యం త‌ర‌పున డెహ్ర‌డూన్‌లోని ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పోందారు.  అప్ప‌ట్లో ఆయ‌న‌కు మ‌త‌ప‌ర‌మైన విష‌యాల ప‌ట్ల అంత ఆస‌క్తి చూపేవారు కాద‌ని అప్ప‌టి ఆయ‌న స‌హ‌చ‌రులు పేర్కొన్నారు.  శారీర‌కంగా దృఢంగా క‌నిపించే ఆయ‌న్ను అంద‌రూ షేర్ అని పిలిచేవార‌ని ఆయ‌నతో క‌లిసి మిల‌ట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందిన క‌ల్న‌ల్ కీస‌ర్ సింగ్ షెకావ‌త్ పేర్కొన్నారు.  

Read: విప‌క్ష‌నేత‌ల‌తో సోనియా కీల‌క స‌మావేశం…ఆ పార్టీల‌కు అంద‌ని ఆహ్వానం…

25 ఏళ్ల వ‌య‌సులో ఆఫ్ఘ‌న్ కేడెడ్ త‌ర‌పున షేర్ మిల‌ట‌రీ శిక్ష‌ణ‌కు వ‌చ్చార‌ని, మొత్తం 45 మంది విదేశీయులు మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ‌పొందార‌ని క‌థ‌నం.  1996 వ‌ర‌కు ఆఫ్ఘ‌న్ సైన్యంలో ప‌నిచేసిన షేర్ మొహ్మ‌ద్ అబ్బాస్ ఆ త‌రువాత సైన్యానికి గుడ్‌బై చెప్పి తాలిబ‌న్‌లో చేరిపోయాడు.  తాలిబ‌న్ల త‌ర‌పున వాషింగ్ట‌న్‌లో కీల‌క దౌత్యం వ‌హించారు. తాలిబ‌న్ల‌కు దౌత్య‌ప‌ర‌మైన హోదాను ఇవ్వాల‌ని ఆయ‌న అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు క్లింట‌న్‌కు కోరారు.  కానీ, కుద‌ర‌లేదు.  తాలిబ‌న్ల‌కు, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌ని హుక్కానీ గ్రూప్‌లో ఆయ‌న కూడా ఒక స‌భ్యుడిగా ఉన్నారు.  ఆంగ్ల‌భాష‌పై షేర్‌కు ప‌ట్టు ఉండ‌టంతో పాటుగా మిల‌ట‌రీ శిక్ష‌ణ‌లో అనుభ‌వం ఉండ‌టంతో తాలిబ‌న్ సంస్థ‌లో వేగంగా కీల‌క స‌భ్యుడిగా ఎదిగారు.  తాలిబ‌న్ లో ఏడుగురు కీల‌క వ్య‌క్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రు కావ‌డం విశేషం.  

Exit mobile version