NTV Telugu Site icon

Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదానికి ముందు ఏయిర్‌హోస్టెస్ టిక్‌టాక్.. వీడియో వైరల్

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. నేపాల్ తో పాటు భారత్ కు చెందిన ప్రయాణికులు కూడా మరణించారు. సిబ్బంది, ప్రయాణికులతో మొత్తం 72 మంది మరణించారు. తామంతా సేఫ్ గా ల్యాండ్ అవుతామని అనుకున్నారు.. కానీ ల్యాండింగ్ కొన్ని నిమిషాల ముందు కుప్పకూలిపోయింది యతి ఎయిర్ లైన్స్ విమానం. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత అనేక విషాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.

ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఫేస్ బుక్ స్ట్రీమింగ్ చేసిన వీడియో ఇప్పటికే వైరల్ అయింది. స్ట్రీమింగ్ జరుగుతున్న సందర్భంలోనే విమానం కూలిపోవడం ఇందులో గమనించవచ్చు. ఆ తరువాత ఈ విమానం కో పైలెట్ అంజూ ఖతీవాడ జీవితం కూడా అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. మరికొన్ని రోజుల్లో కో పైలెట్ నుంచి పైలెట్ హోదా పొందబోతున్న సమయంలో ఆమె ఈ ప్రమాదంలో మరణించింది. 2006లో అంజూ భర్త కూడా ఇలాగే విమాన ప్రమాదంలో మరణించాడు.

Read Also: Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రమాదానికి ముందు ఎయిర్‌హోస్టెస్ చేసిన వీడియో వైరల్ గా మారింది. విమాన ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు యతి ఎయిర్ లైన్స్ క్యాబిన్ సిబ్బంది టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం ఉదయం పోఖారాలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. ఇందులో నలుగురు క్యాబిన్ క్రూ కూడా చనిపోయారు. వీరిలో ఒషిన్ అలే మగర్ ఒకరు.

నేపాల్ కు చెందిన 24 ఏల్ల అలే మగర్ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ, విమానంలో పోజులిస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. ఆదివారం సంక్రాంతి సందర్భంగా పనికి వెళ్లవద్దని అలే తండ్రి రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది మోహన్ అలె మగర్, కూతురుకు సూచించినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ చేసుకుంటున్న సమయంలో విమానప్రమాద విషయం తెలిసిందని ఆయన వెల్లడించారు.