NTV Telugu Site icon

Horrible Femicide: సేద తీరడానికి బీచ్‌కి వెళ్లారు.. దారుణ హత్యకు గురయ్యారు

3 Girls Beach Case

3 Girls Beach Case

Three Young Women Found Dead At Equador Esmeraldas River: ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఉన్న ఎస్మరాల్డస్ బీచ్‌ వద్ద దారుణం చోటు చేసుకుంది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతుల్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆపై వారి మృతదేహాలు కనిపించకూడదని పాతిపెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘాతుకం జరిగి ఇన్ని రోజులవుతున్నా, నిందితుల్ని పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారు. తమపై ఏదో దాడి జరగబోతోందని ముందే గ్రహించిన ఆ ముగ్గురు యువతులు.. తాము డేంజర్‌లో ఉన్నామని, ఏదో జరగబోతోందని తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. ఆ మెసేజ్‌లు పంపిన కాసేపటికే.. దుండగులు ఆ ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి, గొంతు కోసి హతమార్చారు.

Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి

ఆ ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). తమ భవిష్యత్ గురించి పక్కా ప్లాన్స్ వేసుకున్న ఈ ముగ్గురు స్నేహితులు.. బీచ్‌కు వెళ్లి సరదాగా సమయం గడపాలని భావించారు. అన్ని ఏర్పాట్లు చేసుకొని.. ఏప్రిల్ 4వ తేదీన ఎస్మరాల్డస్ బీచ్‌‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే స్విమ్ సూట్లు ధరించి, బీచ్‌లో ఎంజాయ్ చేశారు. అయితే.. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ ముగ్గురిని వెంబడిస్తూ వచ్చారు. తొలుత ఆ యువతులు వాళ్లను గ్రహించలేదు. కానీ.. అందరూ ఈ బీచ్ ప్రాంతం నుంచి వెళ్లిపోయాక, తమని ఎవరో వెంబడిస్తున్నారన్న విషయం వాళ్లకు అర్థమైంది. అప్పుడే తాము డేంజర్‌లో ఉన్నామని గ్రహించిన ఆ యువతులు.. రాత్రి 11:10 గంటల సమయంలో తమ ప్రియమైన వారికి ‘తాము ప్రాణపాయ స్థితిలో ఉన్నా’మని మెసేజ్‌లు పంపారు. నయేలి తన సోదరికి.. ‘‘ఏదో జరదకూడదని జరగబోతోందని భయంగా ఉంది, అందుకే నీకు మెసేజ్ చేశా’’ అని సందేశం పంపింది. సోదరి వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నయేలికి ఆల్రెడీ పెళ్లై, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది.

Extramarital Affair: అల్లుడితో లాడ్జ్‌కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్

డెన్నిస్ కూడా హత్యకు గురికావడానికి ముందే.. తన ప్రియుడికి ‘‘ఏదో బ్యాడ్‌గా జరగోబోతోందని అనిపిస్తోంది, ఒకవేళ నాకేదైనా జరిగితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఐ లవ్‌ యూ వెరీ మచ్‌’ అని మెసేజ్ చేసింది. మెసేజ్ అందుకున్న వెంటనే ప్రియుడు కాల్ చేయగా.. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయి ఉంది. అనంతరం కాసేపటికే ఆ దుండగులు వారిని దారుణంగా హతమార్చి, వారి మృతదేహాల్ని పూడ్చి పెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా.. వాళ్లకు శవాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒక యువతి, బీచ్‌కి వెళ్లడానికి ముందు ఒక హోటల్‌లో గడిపిన విషయం తెలిసింది. దీంతో.. క్లూస్ కోసం పోలీసులు సీసీటీవీ రికార్డులు పరిశీలిస్తున్నారు.