NTV Telugu Site icon

US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

Us

Us

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీతరెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్‌ (6), ఆమె అత్త సునీత (56)గా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Sudiksha Missing: సుదీక్ష మిస్సింగ్‌పై కీలక అప్‌డేట్

సిద్దిపేటకు చెందిన రోహిత్‌రెడ్డితో ప్రణీతరెడ్డికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్త సునీతతో కలిసి ప్రణీతరెడ్డి, రోహిత్‌రెడ్డి, ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రణీతరెడ్డి, పెద్ద కుమారుడు హర్వీన్‌, సునీత సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. రోహిత్‌రెడ్డి, చిన్న కుమారుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో రోహిత్‌రెడ్డే కారు నడుపుతున్నాడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టేకులపల్లి, సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు భారత్‌కు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!