Space events in 2026: కొత్త ఏడాది 2026కు ప్రపంచం మొత్తం ఘనంగా స్వాగతం పలికింది. అయితే, ఈ ఏడాది ఆకాశంలో 5 అంతరిక్ష అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. అరుదుగా వచ్చే ఈ అంతరిక్ష సంఘటనలను తప్పకచూడాలి. ఈ ఏడాది ప్రారంభంలోనే మిరుమిట్లు గొలిపే ఉత్కాపాతం దర్శనమిస్తుంది. రాత్రిళ్లు కనువిందు చేయనుంది. ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు సూపర్ మూన్‌లు ఏర్పడనున్నాయి.
1. క్వాండ్రాటిడ్స్ ఉల్కాపాతం.
జనవరి 3 నుంచి 4 రాత్రి క్వాండ్రిటిడ్స్ ఉల్కాపాతం సంభవించనుంది. అనుకూల వాతావరణంలో గంటలకు దాదాపుగా 100 షూటింగ్ స్టార్లు దర్శమివ్వగలవు. ఉత్తర భారతదేశంలో ఉదయం ముందు వేళ ఉత్తర-తూర్పు దిశగా చూస్తే ఈ ఉల్కాపాతం కనిపిస్తుంది.
2. వుల్ఫ్ మూన్ ‘‘సూపర్ మూన్’’.
2026 జనవరి 3న ఈ ఏడాదిలో తొలి పౌర్ణమి సూపర్ మూన్ కనిపిస్తుంది. దీనిని ‘‘వుల్ఫ్ సూపర్ మూన్’’గా పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో చంద్రుడి కన్నా ఎంతో ప్రకాశవంతంగా, పరిమాణంలో పెద్దదిగా కనిపిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఖగోళ ఈవెంట్‌ను చూడొచ్చు.
3. భూమికి దగ్గరగా గురుడు.
జనవరి 10న గురుగ్రహం(జూపిటర్) భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. ఒక నక్షత్రంలా గురుగ్రహం కనిపస్తుంది. సూర్యస్తమయం నుంచి తెల్లవారుజాము వరకు కనిపిస్తుంది. బైనాక్యులర్ సహాయంతో గురుడి నాలుగు పెద్ద చంద్రులను కూడా చూడొచ్చు.
4. సంపూర్ణ సూర్యగ్రహణం.
ఆగస్టు 12న గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర స్పెయిన్ అంతటా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో పగటి పూటే రాత్రి ఏర్పడుతుంది. భారత్ నుంచి ఈ గ్రహణం పూర్తిగా కనిపించకపోయినా, ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప పాక్షికంగా మసకబారిన సూర్యుడిని చూడవచ్చు.
5. కోల్డ్ మూన్ ‘‘సూపర్ మూన్’’.
డిసెంబర్ 23న ‘కోల్డ్ మూన్’ అనే సూపర్‌మూన్ ఏర్పడనుంది. 2019 తర్వాత భూమికి అత్యంత దగ్గరగా కనిపిస్తుంది. సాయంత్రం తర్వాత ఆకాశంలో విపరీతంగా ప్రకాశించే చంద్రుడిని చూడొచ్చు.
