Site icon NTV Telugu

తాలిబ‌న్ల‌పై ఆఫ్ఘ‌న్ స్థానిక దళాలు పోరాటం… మూడు జిల్లాలకు విముక్తి…

ప్రస్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్ మొత్తం తాలిబ‌న్ల వశం అయింది.  రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో తాలిబ‌న్లు పాలనలోకి ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్లిపోయింది.  రాజధానిలో అరాచకాలు జరుగుతున్నాయి.  కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద తాలిబ‌న్లు తెగబడుతున్నారు.  ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్తున్న వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రుపుతున్నారు.  ఒక‌వైపు ఇలా ఉంటే,  ఆఫ్ఘ‌న్ ఆర్మీ ప‌క్క‌కు త‌ప్పుకున్నా, స్థానిక ప్ర‌జ‌లు ప్ర‌త్యేక ద‌ళాలుగా ఏర్ప‌డి తాలిబ‌న్ల‌తో పోరాటం చేస్తున‌న్నారు.  బ‌గ్లాన్ ప్రావిన్స్‌లోని స్థానిక ద‌ళాలు తాలిబ‌న్ల‌పై తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి.  స్థానిక ద‌ళాల చేతిలో అనేక‌మంది తాలిబ‌న్లు మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది.  తాలిబ‌న్ల చెర నుంచి  హెస‌ర్, దే స‌లాహ్‌, బ‌ను జిల్లాలు విముక్తి పొందాయి.  ఈ జిల్లాల నుంచి తాలిబ‌న్ల‌ను స్థానిక ద‌ళాలు త‌రిమికొట్టాయి.  బ‌గ్లాన్ ప్రావిన్స్‌లో పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేస్తున్న‌ట్టు స్థానిక ద‌ళాలు చెబుతున్నాయి.  

Read: ఉగ్రరూపం దాలుస్తున్న డెల్టా వేరియంట్‌… ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆంక్షలు…

Exit mobile version