Site icon NTV Telugu

Jay Bloom On Titan: టైటాన్‌లో మమ్మల్ని రమ్మన్నారు.. కానీ షెడ్యూల్‌ కుదరక వెళ్లలేదు..జే బ్లూమ్

Jay Bloom

Jay Bloom

Jay Bloom On Titan: టైటానిక్‌ శిథిలాలను చూడటానికి టైటాన్‌లో తమను కూడా రమ్మన్నారని లాస్ వెగాస్ పెట్టుబడిదారుడు మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జే బ్లూమ్ తెలిపారు. అట్లాంటిక్‌ మహాసముద్రంలో పేలిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌లో తాము ప్రయాణించాల్సి ఉండగా.. తమ ప్రయాణానికి షెడ్యూల్‌ కుదరకపోవడంతో తాను… తన కుమారుడు టైటాన్‌లో ప్రయాణించలేదని తెలిపారు. తాము ప్రయాణించకపోవడమే తమకు మేలు జరిగిందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త షాహ్లాదా దావూద్‌ అతని కుమారుడు సులేమాన్‌ల స్థానంలో తాను, తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని.. కానీ చివరి నిమిషంలో తప్పుకొని ప్రాణాలను నిలుపుకున్నామన్నారు.

Read also; Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు

సోమవారం, బ్లూమ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓషన్‌గేట్ CEO స్టాక్‌టన్ రష్ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించాలని మేలో కోరారని బ్లూమ్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. అయితే టైటాన్‌లో ప్రయాణంలో భద్రతపై తనకు నమ్మకం లేకపోవడంతోనే తాము ప్రయాణం చేయలేదని చెప్పారు. టైటాన్‌ భద్రతపై సందేహించాల్సిన అవసరం లేదని స్టాక్‌టన్‌ రష్‌ తనతో చెప్పారని బ్లూమ్‌ తెలిపారు. హెలికాఫ్టర్‌లో ప్రయాణం కంటే ఇంకా భద్రంగా ఉంటుందని తనకు చెప్పారని.. కానీ తనకు నమ్మకం కలగకపోవడంతోనే తాము ప్రయాణం చేయకుండా విరమించుకున్నట్టు తెలిపారు. తాము ప్రయాణం చేసి ఉంటే.. పాకిస్థాన్‌ వ్యాపారి, అతని కొడుకు స్థానంలో తాము ఉండే వారమన్నారు. తన నమ్మకమే ఈ రోజు తమ ప్రాణాలు నిలిపిందన్నారు. అలా కాకుండా స్టాక్‌టన్‌ రష్‌ మాటలపై తాము టైటాన్‌లో ప్రయాణం చేసి ఉంటే.. ఈ రోజు వేరే ప్రాంతంలో ఉండే వారమని.. తన నమ్మకమే.. తనను, తన కుమారున్ని బ్రతికుండ గలిగామన్నారు.

Exit mobile version