Site icon NTV Telugu

చైనా వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు…

2019లో చైనాలో మొద‌లైన క‌రోనా ఆ త‌రువాత మ‌హ‌మ్మారిగా మారి ప్ర‌పంచం మొత్తం వ్యాపించింది.  ప్ర‌పంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేశాయి.  అయితే, ఫైజ‌ర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫ‌ర్డ్-అస్త్రాజెన‌కా టీకాలు కొంత ఖ‌రీదుతో కూడుకొని ఉన్నాయి.  క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బయ‌ట‌ప‌డేందుకు చైనా రెండు ర‌కాల వ్యాక్సిన్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  

Read: కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…?

ఈ రెండు ర‌కాల వ్యాక్సిన్ల‌ను 90 దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ది.  త‌క్కువ ధ‌ర‌కు ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  మంగోలియా, సీషెల్స్‌, బ‌హ్రెయిన్ వంటి దేశాలు చైనా వ్యాక్సిన్లను ఎక్కువ‌గా కొనుగోలు చేశాయి. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వేసిన త‌రువాత కేసులు త‌గ్గ‌క‌పోగా, పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి.  దీంతో ఆయా దేశాలు ఆందోళ‌న‌లు చెందుతున్నాయి.  

Exit mobile version