NTV Telugu Site icon

Israel-Hamas War: హిజ్బుల్లా డిప్యూటీ కమాండర్ ముస్తఫా అహ్మద్ షాహదీ హతం

Idf

Idf

లెబనాన్‌లోని హిజ్బుల్లా యొక్క రద్వాన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ ముస్తఫా అహ్మద్ షాహదీ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ముస్తఫా అహ్మద్ షాహదీ ఇజ్రాయెల్‌పై అనేక తీవ్రవాద దాడులకు పురికొల్పినట్లుగా గుర్తించారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికులపై ఇతడు దాడులకు పురికొల్పినట్లుగా పేర్కొన్నారు. ఇక లెబనాన్‌లో హిజ్బుల్లా ఉపయోగించిన సొరంగ నెట్‌వర్క్‌ను కూడా ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ మేరకు బుధవారం ఐడీఎఫ్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Ayodhya: అయోధ్యలో 25 లక్షలకు పైగా దీపాల అద్భుత దృశ్యం.. రెండు గిన్నిస్ రికార్డులు

ఇక తూర్పు లెబనాన్‌లోని మొత్తం బాల్‌బెక్ నగరానికి ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఖాళీ చేయాలని నివాసితులకు వార్నింగ్ ఇచ్చింది. బాల్‌బెక్, పరిసర ప్రాంతాలైన బెకా వ్యాలీలోని కీలక మార్గాల్లో నివాసితుల తరలింపునకు హెచ్చరికను జారీ చేసింది. తరలింపు కోసం గుర్తించబడిన ప్రాంతం పురాతన రోమన్ ఆలయ సముదాయం పేర్కొనబడింది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా వ్రాయబడి ఉంది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్ పట్టణంలో ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 10 మంది మరణించారని మేయర్ చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు పట్టణ మేయర్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Chandrababu: బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం

గతేడాది నుంచి ఇజ్రాయెల్.. హమాస్, హిజ్బులా లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే అగ్ర నేతలందరినీ ఇజ్రాయెల్ హతం చేసింది. తాజాగా ఇరాన్‌పై కూడా దాడులకు దిగింది. ఇక ప్రతీకార దాడులు చేస్తే అత్యంత వేగంగా తాము చేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇక హిజ్బుల్లా చీఫ్‌గా కొత్తగా నయీం ఖాసిమ్ ఎన్నికయ్యాడు. ఇతడ్ని కూడా చంపేస్తామని తాజాగా ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!