NTV Telugu Site icon

China: చైనా ఆర్థిక వ్యవస్థపై పెళ్లిళ్ల ప్రభావం.. నో మ్యారేజ్ అంటున్న యూత్..

China

China

China: చైనా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ చూడని విధంగా తీవ్రమై ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బయటకు కనిపించకపోయినా చైనా ఆర్థిక వ్యవస్థ డొల్లగా మారిందని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా తర్వాత నుంచి ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఇదిలా ఉంటే చైనాలో యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు ప్రకటించినా కూడా అక్కడి యువతీయువకులు పెళ్లిళ్లు చేనుకోవడానికి ససేమిరా అంటున్నారు.

అయితే ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. అక్కడి వెడ్డింగ్ వ్యాపారం పూర్తిగా దిగజారిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడి వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. చైనాలో పెళ్లిళ్లు తగ్గడం 500 బిలియన్ డాలర్ల వ్యాపారం తగ్గిపోయింది, తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. పెళ్లిళ్లు తగ్గడం వల్ల చైనాలో 60 ఏళ్ల కనిష్టానికి జనాభా తగ్గుదల నమోదైంది. జననాల రేటు తగ్గిపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.

Read Also: Martin Luther King : తమిళ్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంపూర్ణేష్ బాబు

గతేడాది చైనా అంతట 6,80,000 మిలియన్ల వివాహాలు జరుగాయి. 2021లో ఇది ఈ సంఖ్య 8,00,000గా ఉంది. 1986లో నుంచి చూస్తే ఇదే అత్యల్పం. వివాహాలు తగ్గడం వల్ల చైనాలో జననాల క్షీణతను పెంచుతుంది. దీంతో డ్రాగన్ కంట్రీలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగోంది. చైనాలో పిల్లల్ని పెంచడాన్ని ఇప్పటి యూత్ భారంగా భావిస్తుండటంతో పెళ్లిళ్లకు నిరాకరిస్తున్నారని చైనా మార్కెట్ రీసెర్చ్ గ్రూప్‌ మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ స్ట్రాటజీ బెన్ కావెండర్ అన్నారు.