Martin Luther King : తమిళ్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంపూర్ణేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంపూర్ణేష్‌బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి..అయితే తన మొదటి సినిమా హృదయకాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం అంతగా అందుకోలేకపోయాడు.లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్‌ను కూడా కన్ఫామ్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసారు.
సంపూర్ణేష్‌బాబు తల పై కిరీటం ఉండటం, అందులో కొంతమంది నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేస్తోన్నట్లుగా డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, నరేష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఓ కోలీవుడ్ రీమేక్ అని తెలుస్తుంది.. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా అనే సినిమా మంచి విజయం సాధించింది.బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తుది నామినేషన్స్లో ఆ సినిమా కు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకున్నది. అయితే సూపర్ హిట్ అయిన మండేలా సినిమా ఆధారంగానే మార్టిన్ లూథర్ కింగ్ రూపొందుతోన్నట్లు సమాచారం. పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.మరి ఈ సినిమాతో సంపూ మరో హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.
Also Read
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
తాజావార్తలు
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!