Site icon NTV Telugu

Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..

Death And Brain

Death And Brain

Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్నాయి.

అయితే, శాస్త్రీయ అధ్యయనాల, మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన వారి అనుభవాల ద్వారా మెదడు కార్యకలాపాల గురించి మనకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. గుండె ఆగిపోయిన క్షణంలోనే మెదడు తన పనిని ఆపేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బదులుగా కొన్ని మెదడు తరంగాలు, ముఖ్యంగా గామా డోలనాలు పెరగొచ్చు. ఇవి జ్ఞాపకశక్తి, కలలు కనడం, తీవ్రమైన ఆలోచనలతో ముడిపడి ఉంటాయి. కొంతమందికి జీవితం మొత్తం ఒక ఫ్లాష్‌లా కనిపిస్తుంది. తమకు ప్రియమైన వారి ఫోటోలు కనిపిస్తాయి. దీనినే పరిశోధకులు ‘‘లైఫ్ రీకాల్’’గా పిలుస్తారు.

Read Also: Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్

ఒక రీసెర్చ్‌లో గుండెపోటు వచ్చిన రోగిలో శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను ట్రాక్ చేశారు. హృదయస్పందన ఆగిపోయిన 30 సెకన్ల ముందు మెదడులో కొన్ని అసాధారణ కార్యకలాపాలు జరిగాయి. ఇవి మనం కలలు కంటున్నప్పుడు, ఏదైనా సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకశక్తికి సంబంధించిన తరంగాలతో పోలి ఉన్నాయి. ఈ చివర క్షణాల్లో మెదడు కీలక జ్ఞాపకాలను తిరిగి పొందే విధానంలో భాగమని పరిశోధకులు చెబుతున్నారు. చావు దగ్గర దాకా వెళ్లొచ్చిన చాలా మంది ప్రకాశవంతమైన కాంతిని లేదా తెలిసిన కొందరి ముఖాలనను చూశామని చెప్పారు.

గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ వేగంగా తగ్గుతుంది. మరణానికి ముందు శరీరంలో ఎండార్ఫిన్లు, ఇతర మెడదు రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి భయం, నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి దాదాపుగా మరణించే వ్యక్తులలో ప్రశాంతవంతమై, నిర్మలమైన భావాలు కనిపించడానికి మెదడులో రసాయనిక చర్యలే కారణమని చెబుతున్నారు. అయితే, అందరికి ఒకేలా అనుభవాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత మెదడు ప్రతిస్పందనకు తగ్గట్లుగా చివరి క్షణాలు ఉండొచ్చని చెబుతున్నారు.

Exit mobile version