Site icon NTV Telugu

Hindu Temple Attack: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..

Baps

Baps

Hindu Temple Attack: అమెరికాలోని ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాయడంతో తీవ్ర దుమారం రేపుతుంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల బాప్స్‌ శ్రీ స్వామినారాయణ మందిరంపై ఈ ఘటనకు పాల్పడ్డారు. అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే, అక్కడికి వెళ్లే నీటి పైపుల్ని సైతం సదరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతి కోసం ప్రార్థనలతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఇదిలాఉండగా.. గత 10 రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోది. దీనికి ముందు న్యూయార్క్‌లోని బాప్స్‌ మందిరం దగ్గర దుండగులు ఇలాగే దాడికి దిగారు.

Read Also: T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

ఇక, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని శాక్రమెంటో పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో హిందూ వర్గానికి చెందిన ప్రజలు ఆలయం దగ్గరకు చేరుకొని.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, ఐక్యత కోసం తాము ప్రార్థించినట్లు తెలిపారు. శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూ అమెరికన్ చట్ట సభ్యుడు అమిబెరా.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇక్కడ.. మత విద్వేషానికి తావులేదని అన్నారు. మరో కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు నైతికంగా తప్పని తెలిపారు. చట్టప్రకారం బాధ్యులను జవాబుదారీ చేయాలని దర్యాప్తు అధికారులకు సూచనలు చేశారు.

Exit mobile version