Site icon NTV Telugu

Close To The Moon: ఆ దేశమే చంద్రుడికి దగ్గర.. ఎవరెస్టు కాదు

Moon

Moon

Close To The Moon: భూమి మీద ఉన్న వారు చంద్రుడు అందరికీ సమానదూరంలో ఉంటుందని భావిస్తుంటారు. కానీ చంద్రుడి నుంచి ఏ దేశం ఎంత దూరంలో ఉందనేది శాస్ర్తవేత్తలు మాత్రమే చెబుతారు. ఎందుకంటే అది భూమి మీద ఉన్నట్టు కిలోమీటర్లలో కొలిస్తే తెలిసేది కాదు. అందుకే చంద్రుడికి ఏ దేశం దగ్గరగా ఉంది.. ఏ దేశం దూరంగా ఉందనేది సైంటిస్టులే చెబుతారు. అలా చూసుకున్నప్పుడు చంద్రుడికి దగ్గరగా ఉన్న దేశం.. శాస్ర్తవేత్తలు చెబుతున్నదాని ప్రకారం..

Read also: Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!

ఆకాశంలో చందమామను అందుకోవాలన్న ఆరాటం ప్రతి మనిషిలో ఉంటుంది. అలా అందుకోవాలంటే అందరి వల్ల కాదు. అందుకే అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌ షిప్పులతో ప్రయాణాలు. అలాగాకుండా భూమ్మీద నుంచే చూస్తే.. చందమామ ఎవరికి దగ్గరో తెలుసా? ఏయే దేశాల వారికి దగ్గరగా ఉంటాడో తెలుసా? అసలు అంతరిక్షానికి భూమ్మీద దగ్గరి ప్రాంతమేంటో ఐడియా ఉందా? చందమామపైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో వాటి గురించి.. తెలుసుకుందా. భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్‌ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదేకదా అంటారు. కానీ అది కొంత వరకే నిజం.. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్‌ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ఎవరెస్ట్‌ కన్నా ఎత్తయిన ప్రాంతాలూ ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయి.

Read also: Manipur: మణిపూర్‌ మహిళలతో అసభ్య ప్రవర్తన.. నిందితుడి ఇంటికి నిప్పు

స్పేస్‌(చంద్రుడి)కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్‌ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్‌లోని హెడెన్‌ ప్లానెటోరియం డైరెక్టర్‌ నీల్‌ డెగ్రాస్‌ టైసన్‌ కలసి అధ్యయనం చేశారు. వారు పరిశీలన చేసిన తర్వాత ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్‌ దేశం పరిధిలోకి వచ్చే ‘మౌంట్‌ చింబోరాజో’ శిఖరం చంద్రుడికి దగ్గరగా ఉంటుందని పరిశీలనలో వెల్లడయింది. దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్‌ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్‌ పరిధిలో ‘మౌంట్‌ చింబోరాజో’శిఖరం ఉంది. ఎవరెస్ట్‌ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్‌తో పోలిస్తే.. చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే.. ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే.. భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు (13 మైళ్లు) దగ్గరగా ఉన్నట్టేనని పేర్కొంటున్నారు.

Exit mobile version