Site icon NTV Telugu

Thailand-Cambodia: తీవ్రమవుతున్న థాయిలాండ్-కంబోడియా ఘర్షణ.. 16 మంది మృతి..

Thailand Cambodia

Thailand Cambodia

Thailand-Cambodia: థాయిలాండ్, కంబోడియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. ఇరు దేశాలు కూడా రాకెట్లు, యుద్ధ విమానాలో దాడులు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ‘‘ప్రీహ్ విహార్’’అనే 1000 ఏళ్ల నాటి హిందూ ధర్మానికి చెందిన శివాలయం ఘర్షణలకు కేంద్రంగా ఉంది. దీని కోసం రెండు దేశాలు గత కొన్నేళ్లుగా ఘర్షణకు దిగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఘర్షణల్లో థాయ్ సైనికుడితో పాటు 16 మంది మరణించారు. రెండు దేశాలు పరస్పరం రాయబారుల్ని బహిష్కరించుకున్నాయి. ప్రధాన దేశాలు ఈ రెండు దేశాలు కాల్పుల విరమణను పాటించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. శుక్రవారం, ఐక్యరాజ్యసమితి ఈ సంక్షోభంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.

Read Also: Juice diet: ప్రాణాలు తీసిన ‘‘జ్యూస్-డైట్’’.. ఆరోగ్యం క్షీణించి బాలుడు మృతి..

రెండు దేశాల మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది యుద్ధంగా మారవచ్చని థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్ హెచ్చరించారు. కంబోడియా దాడులు చేస్తోంది, థాయిలాండ్ తన భూభాగాన్ని కాపాడుకొంటోందని ఆయన అన్నారు. పాఠశాలు, ఆస్పత్రుల వంటి ప్రాంతాలను టార్గెట్ చేస్తూ, కంబోడియా రష్యన్ మేడ్ BM-21 రాకెట్ వ్యవస్థలను ఉపయోగించిందని థాయిలాండ్ ఆరోపించింది. కంబోడియా దాడులకు ప్రతీకారంగా థాయిలాండ్ దాడుల్ని ప్రారంభించింది. సరిహద్దుల్లో ఒక కంబోడియన్ పౌరుడు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు ఆ దేశం ప్రకటించింది.

Exit mobile version