Site icon NTV Telugu

S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..

Tailand

Tailand

S*ex Scandal: థాయ్‌లాండ్ బుద్ధిజాన్ని అనుసరించే ఒక దేశం, ఆ దేశంలో బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా వీరి ప్రభావం ఎక్కువ. అయితే, ఇప్పుడు వారి ప్రతిష్ట మసకబారేలా కొందరు బౌద్ధ సన్యాసులు ప్రవర్తించడం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. లైంగిక దోపిడీ కుంభకోణం బౌద్ధమాధికారుల గౌరవాన్ని దిగజార్చింది. వారి భక్తుల, వారిని విశ్వాసించే వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

ఈ వారం థాయ్ పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. కనీసం 11 మంది సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకుని, వారి కఠినమైన బ్రహ్మచర్యాన్ని దెబ్బతీసిందనే ఆరోపణలపై అరెస్ట్ జరిగింది. వారి బలహీన క్షణాలను రహస్యంగా ఫోటోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కొన్ని వందల ఏళ్లుగా తపోనిష్టతో కొనసాగుతున్న బౌద్ధ ధర్మానికి మచ్చగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు మఠాలపై గౌరవం పోయిందని ఆ దేశ ప్రజలు వాపోతున్నారు.

Read Also: CM Chandrababu: 2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఈ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారడంతో థాయ్ లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్స్ తన పుట్టినరోజు వేడుకులకు 80 మంది సన్యాసులన ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. థాయ్ ప్రజలకు మానసిక నష్టం కలిగించే అనుచిత ప్రవర్తన చేసినట్లు రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, ఈ స్కాండల్‌లో ఇరుకున్న బౌద్ధ సన్యాసులను తొలగించారు. థాయ్‌లాండ్ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేకు పెద్దస్థాయిలో విచారణ చేపట్టారు. అయితే, ఇది మొత్తం ధర్మానికి సంబంధించిన సమస్య కాదని, కొందర తప్పుడు సన్యాసులు చేసిన పని అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణానికి కేంద్రంగా ఉన్న మహిళ.. సన్యాసులు తనను రోజుకు రూ. 90,000లతో షాపింగ్ చేయించే వారని చెప్పింది. సదరు మహిళ 80,000 ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 100 కోట్ల కుంభకోణం ఇది.

థెరవాడ బౌద్ధం థాయ్‌లాండ్‌కు మూలంగా ఉంది. అయితే, ఇప్పుడు మఠాలు పుణ్యకేంద్రాలుగా కాకుండా ధన సంపాదన కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. థాయ్ పురుషులు సాంప్రదాయకంగా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా సన్యాసులుగా నియమితులవుతారు, ఇది కొన్ని వారాల లేదా దశాబ్దాల వరకు ఉంటుంది.మతాధికారులు 227 కఠినమైన నియమాలకు కట్టుబడి ఉంటారు, వీటిలో హస్తప్రయోగంపై నిషేధం, స్త్రీలను తాకడం, వారి నుండి నేరుగా వస్తువులను తీసుకోవడం కూడా ఉన్నాయి. సన్యాసులు సాంప్రదాయకంగా భిక్ష, ఆహార నైవేద్యాలు, నెలవారీ $170 నిరాడంబరమైన స్టైఫండ్‌తో జీవిస్తారు,

Exit mobile version