Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Texas Shooting: టెక్సాస్‌లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్‌మిన్‌స్టర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్‌మెంట్‌లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు వాడిన ఆయుధాల శబ్దం “మెషిన్ గన్ కాల్పుల”ను తలపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. మరికొంతమంది బాధితుల పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాల్పులకు ముందు మరో చోట జరిగిన చిన్నపాటి ఘర్షణే ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది. వేరే పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిన కొందరు మైనర్లు, యువకులు.. కక్షగట్టి అపార్ట్‌మెంట్ వరకు బాధితులను వెంబడించారు. అక్కడ బలవంతంగా లోపలికి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారని సమాచారం.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
అమరిల్లో నగరంలో ఇటీవలి కాలంలో తుపాకీ హింస విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే నగరంలో పలు కాల్పుల ఘటనలు జరగడం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. నేరాల పెరుగుదల, తుపాకుల లభ్యతపై పౌర సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు