NTV Telugu Site icon

ఇజ్రాయిల్‌…పాల‌స్తీనా మ‌ద్య ఉద్రిక్త‌త‌… క‌మ్ముకున్న యుద్ధ‌మేఘాలు…

చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ ఇజ్రాయిల్‌, పాల‌స్తీనా దేశాల మ‌ద్య ఉద్రిక్త ప‌రిస్తితులు నెల‌కొన్నాయి.  పాల‌స్తీనాలోని గాజాప‌ట్టీ ప్రాంతం నుంచి హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడులు చేశారు.  ప‌దుల సంఖ్య‌లో రాకెట్లు ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చాయి.  ఈ దాడిలో ఇజ్రాయిల్‌లోని కొన్ని భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి.  దీనికి ప్ర‌తీక‌గా ఇజ్రాయిల్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాల‌తో దాడులు చేసింది.  ఈ దాడిలో 24 మంది వ‌ర‌కు మ‌ర‌ణించి ఉంటార‌ని ఇజ్రాయిల్ తెలియ‌జేసింది.  దీంతో రెండు దేశాల మ‌ద్య యుద్ద‌వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  1967లో ఇజ్రాయిల్‌లోని తూర్పు జెరూస‌లెం, ప‌విత్ర స్థ‌లాల‌ను ఇజ్రాయిల్ స్వాదీనం చేసుకుంది.  దీనికి గుర్తుగా సొమ‌వారం రోజున జెరూస‌లెం రోజును జ‌రుపుకుంటారు.  అయితే,  ఆ రోజున దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఇజ్రాయిల్ జెరూస‌లెంలోని అల్ అక్సా మ‌సీద్ వ‌ద్ద పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ బ‌ల‌గాల‌కు, ప్రార్ధ‌న‌లు చేయ‌డానికి వ‌చ్చిన వారికి మ‌ద్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.  ఈ ఘ‌ర్ష‌ణ‌లో అనేక మంది గాయ‌ప‌డ్డారు.  దీనికి ప్ర‌తీక‌గా హ‌మాస్ ఉగ్ర‌వాదులు దాడులు చేశార‌ని ఇజ్రాయిల్ బల‌గాలు పేర్కొన్నాయి.