బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయంపై దాడికి పాల్పడిన వారిగా అనుమానిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రోజున స్థానికుల మధ్య గొడవ జరిగిందని, ఆ తరువాతే దేవాలయంపై దాడులు జరిగాయని స్థానికుల సమాచారం. దేవాలయంపై దాడి ఘటన సున్నితమైన అంశం కావడంతో వెంటనే అధికారులు భద్రతను పెంచారు. ఇటీవల పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సిద్ధివినాయక దేవాలయంపై దాడులు జరిగిన తరువాత అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాక్ సుప్రీంకోర్టు సీరియస్ ఆయింది. మసీదుపై దాడులు జరిగినపుడు ఎలాగైతే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారో… దేవాలయంపై దాడులు జరినసమయంలో కూడా అలానే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బంగ్లాలోనూ…పాక్ ఘటన…హిందూ ఆలయంపై దాడి…
