Hindu Temple Attack: ఖలిస్తానీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఇండియాలో అశాంతిని చెలరేగేలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూకే దేశాల్లో పలు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్నారు.
Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు
తాజాగా మరోసారి ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాని అనుకూల మద్దతుదారులు శనివారం దాడి చేశారు. ఆలయగోడలపై జరిగిన విధ్వంసం గురించి ఆలయ పూజారి భక్తులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధ్యక్షుడు సతీందర్ శుక్లా ది ఆస్ట్రేలియన్ టుడే వెబ్బైట్ కు తెలియజేశారు. ఈ ఘటనపై క్వీన్స్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హిందువులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నమే అని హిందూ హ్యుమన్ రైట్స్ డైరెక్టర్ సారా గేట్స్ అన్నారు.
ఆలయంపై హిందూ వ్యతిరేక విద్వేష గ్రాఫిటీని శుభ్రం చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ సారాగేట్స్ ఫోటోలను ట్వీట్ చేశారు. గత రెండు నెలల కాలంలో హిందూ ఆలయాలపై జరిగిన నాలుగో ఘటన ఇది. జనవరి 23న, మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లోని గౌరవప్రదమైన ఇస్కాన్ దేవాలయం గోడలు “హిందూస్థాన్ ముర్దాబాద్” అనే గ్రాఫిటీతో రాతలు రాశారు. అంతకుముందు జనవరి 16న, విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం కూడా ఇదే విధంగా దాడికి గురైంది. నవరి 12న, మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంపై దాడి చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.