Site icon NTV Telugu

Australia: డాల్ఫిన్‌తో కలిసి ఈత కొడదాం అనుకుంది.. పాపం షార్క్ దాడిలో బలైంది..

Shark Attack

Shark Attack

Teen Was Killed By Shark in Australia: నదిలో డాల్ఫిన్ తో ఈత కొడుదాం అని అనుకున్న 16 ఏళ్ల బాలికపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా పశ్చి ప్రాంతంలో చోటు చేసుకుంది. పెర్త్ శివారులోని స్వాన్ నదిలో ఈదుకుంటూ వెళ్లిన బాలికపై దాడి చేసి సొరచేప చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆమెను బతికించేందుకు ప్రయత్నించిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తీవ్రగాయాల పాలైన బాలిక అక్కడిక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: INDvsAUS Test: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చంటే?

ప్రాథమిక సమాచారం ప్రకారం నదిలో స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో డాల్ఫిన్లు కనిపించాయని.. వాటికి దగ్గరలో ఈత కొట్టేందుకు వెళ్లిన సమయంలో షార్క్ దాడి చేసి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే నదీలో ఈ ప్రాంతంలో షార్క్ చేపలు కనిపించడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు తరుచుగా షార్క్ దాడులకు గురవుతుంటారు. ఒక్క 2022 ఏడాదిలోనే 15 షార్క్ దాడులు జరిగాయి.

Exit mobile version