NTV Telugu Site icon

ఆఫ్ఘన్ లో రోడ్డున పడ్డ టీచర్లు

ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్‌ ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ లోని టీచర్లు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని టీచర్లు రోడ్డెక్కారు. జీతాలు రాకపోవడంతో తమకు కుటుంబపోషణతో పాటు పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక్క హెరాత్‌ ఫ్రావిన్స్‌లోనే 30కి పైగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదంటున్నారు.

ఇప్పటికైనా తాలిబాన్‌ ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జీతాలు రాకపోవడతో కరెంటు బిల్లులు సైతం కట్టలేదని దీంతో కరెంట్‌ కట్ చేశారని అక్కడి టీచర్లు వాపోతున్నారు. తాలిబాన్‌ ప్రభుత్వ ఆంక్షలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబాన్‌లు ఎలాంటి ఆంక్షలు విధించకుండా పరిపాలనా సాగిస్తామని అంతర్జాతీయ ప్రపంచాన్ని నమ్మించి ఇప్పుడు తిరిగి తమ అరాచక పాలనకు తెరదించుతున్నారని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.