Site icon NTV Telugu

మొద‌లైన ఆరాచ‌క పాల‌న‌: ఇంటింటిని గాలిస్తున్న తాలిబ‌న్లు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోక‌ముందే త‌మ ఆరాచ‌క పాల‌న‌ను మొద‌లుపెట్టారు.  ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో ష‌రియా చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తున్నారు.  దీనికి సంబందించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  కాబూల్‌లోని ప్ర‌జ‌ల‌ను ఏమీ చేయ‌బోమ‌ని చెబుతూనే, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వానికి, యూఎస్ ఆర్మీకి స‌హ‌క‌రించిన వారి వివ‌రాలు సేక‌రించ‌డం మొద‌లుపెట్టారు.  ఇంటింటికి వెళ్లి వివ‌రాలు కనుక్కునే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి.  దీంతో కాబూల్ వాసుల్లో తెలియ‌ని భ‌యం నెల‌కొన్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ జీవ‌నం సాగించిన కాబూల్ వాసుల‌కు తాలిబ‌న్ల రాక‌తో ఎప్పుడు వ‌చ్చి ఎవ‌ర్ని ఎత్తుకు వెళ్తారో…ఎప్పుడు చంపేస్తారో తెలియ‌క భ‌యం భ‌యంగా కాలం వెల్ల‌బుచ్చుతున్నారు.  

Read: గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటన.. 7గురు అరెస్ట్.. !

Exit mobile version