ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు ఎటునుంచి వచ్చి కాల్పులు జరుపుతారో… ఎవర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మహిళ కనిపిస్తే ఏం చేస్తారో అని భయాందోళనల మధ్య కాలం వెల్లబుచ్చుతున్నారు. కాబూల్ నగరం చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండటంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో ఏదోక దేశం వెళ్ళి తలదాచుకోవడమే. దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే, ఎయిర్‌పోర్ట్ కూడా సాధారణ విమానాల రాకపోకలపై నిషేదం విధించడంతో ఆర్మీ విమానాల్లో అయినా సరే బయటపడాలని చూస్తున్నారు. ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని ప్రజలు చూస్తుంటే, కాబూల్ నగరంలోకి ప్రవేశించిన తాలిబన్లు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి రోజున అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించిన తాలిబన్లు అక్కడ ఫుల్‌గా తినేసి ఎంజాయ్ చేశారు. కొంతమంది నగరంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు వెళ్లి అక్కడ ట్రాయ్ కార్లలో తిరుగుతూ, చెక్క గుర్రాలపై రౌండ్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబందించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజలు పారిపోతుంటే… పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు…
