Site icon NTV Telugu

ఆఫ్ఘన్‌కు భారత్‌ గిఫ్ట్‌… లాక్కున్న తాలిబన్లు

Taliban

Taliban

క్రమంగా ఆఫ్ఘనిస్థాన్‌పై పట్టు సాధిస్తున్నారు తాలిబన్లు.. త్వరలోనే ఆఫ్ఘన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటామని ముందుకు కదులుతున్న తాలిబ‌న్ ఫైట‌ర్లు.. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బ‌ల‌గాల‌కు భారత్‌ బహుమతిగా ఇచ్చిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.. భారత్‌ ఇచ్చిన గిఫ్ట్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబ‌న్లు. ఆ హెలికాప్టర్ ప‌క్కన తాలిబ‌న్లు నిల‌బడి ఉన్న ఫొటోలు, వీడియోలను రిలీజ్‌ చేవారు.. అయితే, అది ఉపయోగించడానికి వీలు లేకుండా ముందుగానే ఆఫ్ఘన్‌ బలగాలు ప్లాన్‌ చేసినట్టు కనిపిస్తోంది… ఎందుకంటే.. హెలికాప్టర్‌కు ఉండాల్సిన రోటార్ బ్లేడ్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. తాలిబ‌న్లు దీనిని ఉప‌యోగించ‌కుండా ఉండేందుకు వీటిని తొల‌గించిన‌ట్లుగా భావిస్తున్నారు. కాగా, 2019లో ఎంఐ 24 అటాక్ హెలికాప్టర్‌ను ఆఫ్ఘన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చింది భారత్… దీంతోపాటు మూడు చీతా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను కూడా పంపింది.. 2015లోనూ ఇలాగే నాలుగు అటాక్ హెలికాప్టర్లను ఇవ్వగా.. ఎంఐ 24ను కూడా అందులో చేర్చారు.. మరోవైపు.. క్రమంగా ఆఫ్ఘన్‌పై పట్టుసాధిస్తున్నారు తానిబన్లు.. ఇప్పటికే 65 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తోంది.. వారి దూకుడును ఆపడం ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు.

Exit mobile version