Site icon NTV Telugu

ఆఫ్ఘ‌న్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల‌పై తాలిబ‌న్ దాడులు… పత్రాలు స్వాధీనం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దిగ‌జారిపోతున్నాయి.  ప్ర‌జాస్వామ్యానికి తావులేద‌ని, ష‌రియా చ‌ట్టం ప్ర‌కార‌మే పాల‌న ఉంటుంద‌ని, అయితే, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రానివ్వ‌మ‌ని, మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని చెబుతూనే, వారిపై దాడులు చేస్తున్నారు.  ఆఫ్ఘ‌నిస్తాన్ జాతీయ‌జెండాను ప్ర‌ద‌ర్శిస్తున్న పౌరుల‌పై కాల్పులు జ‌రుపుతున్నారు. ముష్క‌రుల పాల‌న ఎలా ఉండ‌బోతుందో చెప్పేందుకు ఇది కేవ‌లం ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.  ఇక ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని రాయ‌బార కార్యాల‌యాల‌ను ఇప్ప‌టికే ఇండియా ప్రభుత‌వం మూసేసింది.  కాబూల్‌, హెరాత్‌, కాంద‌హార్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాలు ఉన్నాయి.  అక్క‌డి నుంచి సిబ్బందిని ఇప్ప‌టికే ఇండియాకు త‌ర‌లించారు.  ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మూడు న‌గ‌రాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల‌పై తాలిబ‌న్లు దాడులు చేశారు.  రాయ‌బార కార్యాల‌యాల్లోకి ప్ర‌వేశించి కొన్ని ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.  కార్యాల‌యాల్లోని వాహ‌నాల‌ను త‌మ‌వెంట తీసుకెళ్లిన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొన్న‌ది.  

Read: మ‌హారాష్ట్ర‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం: 13 మంది మృతి…

Exit mobile version