ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా మారింది. ఆర్ధికపరమైన కార్యకలాపాలు నిర్వహించాలంటే ఈ నగరం కీలకం. ప్రభుత్వ దళాలు ఇప్పటికే తాలిబన్లకు లొంగిపోయాయి. కాందహార్‌తో పాటు, సైనిక, పరిపాలనా కేంద్రంగా ఉన్న హెరాత్ నగరాన్ని కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
తాలిబన్లకు కాందహార్ కీలకం… ఎందుకంటే…
