NTV Telugu Site icon

Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్‌ని నిర్బంధించి..

Talibans Attack Police Stat

Talibans Attack Police Stat

Taliban militants take hostages in northwest Pakistan: పాకిస్తాన్‌లో తాలిబన్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కౌంటర్-టెర్రరిజం సెంటర్ (ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం)పై దాడి చేసి.. దాన్ని నిర్బంధించారు. అందులో ఉన్న 9 మంది భద్రతా సిబ్బందిని సైతం బంధించి, ఆ కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.. ఇంతకుముందు అరెస్ట్ చేసిన కొందరు తాలిబన్ మిలిటెంట్లలోని ఒక ఉగ్రవాదిని ఆదివారం ఆ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రంలోని కంటోన్మెంట్‌లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అతడు ఒక అధికారి నుంచి ఏకే-47 లాక్కొని.. కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందారు. అనంతరం.. ఇతర ఉగ్రవాదుల్ని కూడా విడిపించి, ఆ కేంద్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

Kabul Fuel Tanker Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి, 19 మంది దుర్మరణం

అనంతరం ఆ తాలిబన్ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు. వాళ్లను విడిచిపెట్టాలంటే, తమను క్షేహంగా దేశం దాటించి, ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకోసం ఒక హెలికాప్టర్ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. తాలిబన్ల చెర నుంచి అధికారుల్ని విడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతవరకూ బయట నుంచి ఎలాంటి ఫైరింగ్ జరపలేదని పాక్ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లు ఏంటో తెలుసుకుంటున్నారు. తాము మొత్తం కంటోన్మెంట్‌ని చుట్టముట్టామని, బన్ను జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని సైతం ఆపేశామని అంటున్నారు.

Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు

Show comments