Site icon NTV Telugu

మొన్న భార‌త్ ఇచ్చిన గిఫ్ట్.. నేడు భార‌త్ నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం..

Afghan Parliament

ఆఫ్ఘనిస్థాన్ క్ర‌మంగా తాలిబ‌న్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని కాబూల్‌లోకి ప్ర‌వేశించిన తాలిబ‌న్లు.. అధ్య‌క్ష భ‌వ‌నాన్ని సైతం స్శాదీనం చేసుకున్నారు.. ఇక‌, క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్‌ నిర్మించిన ఆఫ్ఘన్‌ పార్లమెంట్‌ భవనాన్ని సాయుధ తాలిబన్లు ఇవాళ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్‌ చైర్‌లో ఒక తాలిబన్‌ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉండ‌గా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు తాలిబన్లు కూర్చున్నారు.. కాగా, మొన్న‌టి మొన్న ఆఫ్ఘ‌న్ బ‌ల‌గాల‌కు భారత్‌ బహుమతిగా ఇచ్చిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు తాలిబ‌న్లు.. భారత్‌ ఇచ్చిన గిఫ్ట్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబ‌న్లు. ఆ హెలికాప్టర్ ప‌క్కన తాలిబ‌న్లు నిల‌బడి ఉన్న ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేశారు. మొత్తంగా మొన్న‌.. భార‌త్ గిఫ్ట్ త‌మ ఆధీనంలోకి తీసుకున్న తాలిబ‌న్లు.. ఇవాళ భార‌త్ నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక‌, ఆఫ్ఘ‌న్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వాధేశానికి ర‌ప్పించ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టింది భార‌త ప్ర‌భుత్వం.

Exit mobile version