NTV Telugu Site icon

Afghanistan: హిందువులు, సిక్కులను ప్రతినిధిని నియమించిన తాలిబాన్లు.

Afghanistan

Afghanistan

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైదొలగడంతో అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే రష్యా, చైనా, ఖతార్ లాంటి కొన్ని దేశాలు మినహా అక్కడి ప్రభుత్వానిన ప్రపంచం గుర్తించలేదు. మహిళల హక్కులు, విద్యపై తాలిబాన్ల ఆంక్షలు ఎక్కువ కావడంతో ఆ దేశానికి విదేశాల నుంచి వచ్చే సాయం కూడా తగ్గింది.

Read Also: Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక సంక్షోభం.. 26 విమానాలను రద్దు చేసిన పీఐఏ

ఇదిలా ఉంటే తాలిబాన్లు అధికారం దక్కించుకున్న తర్వాత అక్కడ మైనారిటీల్లో భయాలు మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వేల సంఖ్యలో హిందువులు, సిక్కులు ఉన్నారు. అయితే తాజాగా హిందువులు, సిక్కుల కోసం రాజధాని కాబూల్ లో ఒక ప్రతినిధిని నియమించింది. ఈ విషయాన్ని కాబూల్ మున్సిపాలిటీ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. కొత్తగా నియమించబడిన వ్యక్తి కాబూల్ లోని 22 మునిసిపల్ డిస్ట్రిక్ట్స్ ప్రతినిధుల కౌన్సిల్ లో సభ్యుడిగా వ్యవహరిస్తారు. సిక్కులు, హిందువుల హక్కుల కోసం పనిచేస్తారు.

కాబూల్ లో హిందువులు, సిక్కుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇచ్చే ప్రక్రియలో కొత్తగా నియమించిన ప్రతినిధి కీలక పాత్ర పోషిస్తారని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సిక్కులు, కొంతమంది హిందువులు భారత్ వచ్చారు. 90ల్లో తాలిబాన్లు అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలు తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. మరోసారి ఇలాంటి పరిణామాలు ఎదురవువతాయని భయపడుతున్న సమయంలో తాలిబాన్లు ప్రత్యేకంగా ఒక ప్రతినిధిని నియమించడం ఆశ్చర్యానికి గురిచేసింది.