Site icon NTV Telugu

Nancy Pelosi: తైవాన్‌.. ప్రపంచంలోని స్వేచ్ఛా సమాజాలలో ఒకటి

Nancy Pelosi

Nancy Pelosi

Nancy Pelosi: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ బుధవారం తైవాన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. యూఎస్‌ సెనేట్ స్పీకర్ పెలోసీ తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్‌ను కలిశారు. యూఎస్ స్పీకర్ పెలోసీ నిజంగా తైవాన్‌కు అత్యంత దగ్గర స్నేహితులలో ఒకరని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్‌ అన్నారు. తైవాన్‌కు మద్దతును ఇవ్వడానికి ఈ పర్యటన చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తైవాన్‌తో ఎప్పుడూ నిలబడతామని అమెరికా హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు. అమెరికా స్వయం ప్రభుత్వం, స్వయం నిర్ణయాధికారం కలిగిన ఈ ప్రాంతంలో పరస్పర భద్రతపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచ ఆర్థిక శ్రేయస్సుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. అమెరికా సెనేటే స్పీకర్ మంగళవారం రాత్రి ఆలస్యంగా తైవాన్ చేరుకున్నారు. పరస్పర సహకారానికి తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్‌కు పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని స్వేచ్ఛా సమాజాలలో ఒకటిగా ఉన్నందుకు తైవాన్‌ను తాము అభినందిస్తున్నామని పెలోసీ తైవాన్ పార్లమెంట్‌లో అన్నారు. చైనాతో పోటీపడేలా అమెరికన్ చిప్ పరిశ్రమను బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త అమెరికా చట్టం యూఎస్‌-తైవాన్ ఆర్థిక సహకారానికి గొప్ప సహకారాన్ని అందిస్తుందన్నారు. తన ఆధీనంలోకి తీసుకురావడానికి బలప్రయోగాన్ని ఎన్నడూ వదులుకోలేదు. తైవాన్‌పై సైనిక చర్యకు ఈ పర్యటనను సాకుగా ఉపయోగించుకోవద్దని అమెరికా చైనాను హెచ్చరించింది. చైనా ఇప్పటికే తైవాన్‌లో పలు దిగుమతులపై నిషేధం విధించింది.

పెలోసి వచ్చిన కొద్దిసేపటికే, చైనా సైన్యం తైవాన్ సమీపంలో ఉమ్మడి వైమానిక, సముద్ర కసరత్తులను ప్రకటించింది. తైవాన్‌కు తూర్పు సముద్రంలో సంప్రదాయ క్షిపణుల ప్రయోగాలను ప్రయోగించింది. పెలోసీ పర్యటన తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, చైనా-యూఎస్ సంబంధాల రాజకీయ పునాదిపై తీవ్ర ప్రభావం చూపుతుందని..చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంగళవారం పెలోసి రాకముందు, చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని విభజించే రేఖ వద్ద సందడి చేశాయి. పెలోసి పర్యటనకు ప్రతిస్పందనగా తాము హై అలర్ట్‌లో ఉన్నామని.. లక్ష్యంగా సైనిక కార్యకలాపాలను ప్రారంభిస్తామని చైనా మిలిటరీ తెలిపింది.

Nancy Pelosi: తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనా హెచ్చరిక బేఖాతరు

చైనా బెదిరింపులు లేదా యుద్ధ వాక్చాతుర్యాన్ని చూసి యునైటెడ్ స్టేట్స్ భయపడబోదని.. ఆమె పర్యటన సంక్షోభం లేదా సంఘర్షణను ప్రేరేపించడానికి ఎటువంటి కారణం లేదని పెలోసి రాక తర్వాత వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. తాము తైవాన్‌కు మద్దతునిస్తూ ఉంటామని తేల్చి చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌కు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు, కానీ తనను తాను రక్షించుకునే మార్గాలను అందించడానికి అమెరికన్ చట్టానికి కట్టుబడి ఉంది. తైవాన్‌లో యూఎస్ అధికారుల సందర్శనలు ద్వీపంలోని స్వాతంత్ర్య అనుకూల శిబిరానికి ప్రోత్సాహకరమైన సంకేతాన్ని పంపినట్లు చైనా అభిప్రాయపడింది. తైవాన్ చైనా సార్వభౌమాధికార వాదనలను తిరస్కరించింది. తైవాన్ ప్రజలు మాత్రమే ద్వీపం భవిష్యత్తును నిర్ణయించగలరని పేర్కొంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు 21 చైనా విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించాయని, చైనా ద్వీపం చుట్టూ డ్రిల్‌లతో కీలకమైన ఓడరేవులు, నగరాలను బెదిరించే ప్రయత్నం చేస్తోందని సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు.

Exit mobile version