Syrian Rebel Flag: అరబ్ రిపబ్లిక్‌లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు కూల్చివేశాయి. దీంతో తాజాగా, న్యూఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో రెబల్స్ యొక్క కొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక, ఈ జెండాను ఎగురవేయడంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అయితే, ఆ జాతీయపతాకంలో ఆకుపచ్చ-తెలుపు-నలుపు-ఎరుపు రంగులతో రూపొందించారు. ఒకప్పుడు ప్రతిఘటనకు చిహ్నంగా ఈ జెండా ఉండేది. సిరియన్ అంతర్యుద్ధంలో ఇది బాగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అసద్ పాలన పతనానికి ముగింపు పలికిన తర్వాత సిరియా అధికారిక జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్పుతో అసద్ కుటుంబం యొక్క 50 సంవత్సరాల పాలనకు స్వస్తి పలికినట్లు పేర్కొన్నారు.
Read Also: D Gukesh: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?
అయితే, పాలనలో మార్పుతో పాటు కొత్త జాతీయ జెండాను రూపొందించడంతో సిరియలో వేడుకలు జరుపుకున్నారు. బెర్లిన్, ఇస్తాంబుల్, ఏథెన్స్ వంటి నగరాల్లో కొత్త జెండాతో ర్యాలీలు తీశారు. అలాగే, సిరియాలో అధికారం దక్కించుకున్న తిరుగుబాటుదారులకి తమ మద్దతును తెలియజేసేందుకు జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక, భారతదేశంలోని సిరియన్ ఎంబసీలో జెండా మార్పుతో పాటు దేశంలో మారుతున్న రాజకీయ గుర్తింపుకు స్పష్టమైన సూచనగా పని చేస్తుంది.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఒకే ఒక్క సెంచరీ! ఇదే చివరి అవకాశం
* జెండాలోని రంగులకు అర్థం..
ఆకుపచ్చ: స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది.
తెలుపు: శాంతి, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీక.
నలుపు: సిరియన్లు అనుభవించిన కష్టాలకు సూచిక
మూడు ఎరుపు నక్షత్రాలు: సిరియన్ ప్రజల యొక్క విప్లవం, ఆదర్శాలను సూచిస్తుంది.
ఈ డిజైన్ లో యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ కింద సిరియా, ఈజిప్ట్ యూనియన్‌ను సూచించే రెండు ఆకుపచ్చ నక్షత్రాలు కూడా ఉన్నాయి.