Site icon NTV Telugu

Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్

New Health Minister Collaps

New Health Minister Collaps

స్వీడన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఎలిసబెట్ లాన్ అనే మహిళా మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఉండగా ఒక్కసారిగా ఎలిసబెట్ లాన్ ముందుకు కూలిపోయారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. హడలెత్తిస్తున్న ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

స్వీడన్ ఆరోగ్య మంత్రిగా ఎలిసబెట్ లాన్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 48 ఏళ్ల స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, క్రిస్టియన్ డెమోక్రటిక్స్ పార్టీ నాయకురాలు ఎబ్బా బుష్‌లతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఎలిసబెట్ లాన్ మరొక అధికారి చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ముందుకు వంగి బోల్తా పడ్డారు. వెంటనే ఎబ్బా బుష్ పరుగెత్తుకుంటూ వచ్చి సహాయం చేశారు. అధికారులు, జర్నలిస్టులు వేగంగా స్పందించి గదిలో సపర్యాలు చేశారు. కొద్దిసేపటికి బ్రీఫింగ్ తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే కోలుకున్నారు. ఈ ఘటనతో మీడియా సమావేశం రద్దైంది. రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గినప్పుడు ఇలా జరుగుతుందని ఎలిసబెట్ లాన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Nepal: ఆర్మీ చేతుల్లోకి నేపాల్.. కొనసాగుతున్న కర్ఫ్యూ

సోమవారం అకో అంంకార్ బర్గ్ జోహన్సన్ రాజీనామా చేయడంతో మంగళవరం లాన్ ఆరోగ్యమంత్రిగా నియమితులయ్యారు. జోహన్సన్ మూడేళ్లు పదవిలో కొనసాగారు. 1986లో స్వీడిష్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక లాన్ కూడా చాలా కాలం నుంచి క్రిస్టియన్ డెమోక్రాట్స్‌లో సభ్యురాలిగా ఉన్నారు. గతంలో 2019 నుంచి గోథెన్‌బర్గ్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. శాంతి, అభివృద్ధి అధ్యయనాలు, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. కేబినెట్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

 

Exit mobile version