NTV Telugu Site icon

Short Nap Break: జపాన్ పద్దతి మంచిదే.. ఆఫీసులో పడుకోనివ్వండి..!

Short Nap Break

Short Nap Break

ఆఫీసు వర్క్ టైంలో ఒత్తిడికి అలసిపోతున్నారా? కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తోందా? అయితే పడుకోండి. అవును.. ఉత్పాదకత పెరగాలంటే ఎంప్లాయిస్‌కి కాసేపు రెస్ట్ ఇవ్వడమే మంచిదని చెబుతున్నాయి పలు సర్వేలు. ఇప్పటికే ఇలాంటి పద్దతిని జపాన్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఆఫీసు అవర్స్‌లో ఉద్యోగులు కాసేపు పడుకునేందుకు అక్కడి సంస్థలు వెసులుబాటు కల్పించాయి. ఇది తెలిసి పలు దేశాలు నవ్వుకున్న.. అదే మంచి పద్దతి అంటుంది జీనియస్ కన్సల్టెంట్‌‌‌‌ సర్వే. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో కాసేపు నిద్రపోవడం ముఖ్యమని జీనియస్ కన్సల్టెంట్‌‌‌‌ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు.

Also Read: Nizamabad: సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..

కొందరి ఉద్యోగులతో చేసిన ఈ సర్వేలో ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో న్యాప్‌‌‌‌ (కునుకు తీయడం) బ్రేక్ ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది చెప్పారట.
ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 1207 మంది ఉద్యోగులు పాల్గొన్నగా… అందులో 97 శాతం మంది ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో న్యాప్‌కు ఓటేయగా.. మూడు శాతం మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25–అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27 మధ్య ఈ సర్వే చేసినట్లు జీనియస్ సంస్థ వెల్లడించింది. బ్యాంకింగ్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌‌‌‌ఆర్ సొల్యూషన్స్‌‌‌‌, ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌, బీపీఓ, లాజిస్టిక్స్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, మీడియా, ఆయిల్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది.

Also Read: Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి

ఈ సర్వే ప్రకారం.. ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం పెరుగుతుందని 82 శాతం మంది చెప్పగా, 12 శాతం మంది దీనికి అభ్యంతరం తెలిపారు. పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పగా.. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్‌‌‌‌లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు. జపాన్‌‌‌‌లో పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్‌‌‌‌లో పడుకోవడం)’ విధానం మంచిదని, దానివల్ల ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలుంటుందని 64 శాతం మంది అభిప్రాయపడగా.. దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది పేర్కొన్నారు.