Site icon NTV Telugu

కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ వేయించుకోవాల్సిందేనా?

కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తుంటే తప్పనిసరిగా మూడో వేవ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ కూడా తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా.. మూడో డోస్ తీసుకున్న వారిని ఇతరులతో పోల్చి చూస్తే వారిలో కరోనా వ్యాధి తీవ్రత తక్కువగా కనిపించిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.

Read Also: వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్.. పెట్రోల్ ధరలకు సొల్యూషన్

ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌పై నిర్వహించిన ఓ సర్వే ద్వారా ఈ విషయం స్పష్టమైంది. 12 ఏళ్లకు పైబడి ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్న వారిని గతంలో కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారితో పరీక్షించగా… ఫైజర్ మూడో డోస్ టీకా తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉత్పన్నమైనట్లు వెల్లడైంది. ఈ సర్వేలో సుమారు 7,28,321 మంది పాల్గొన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించినట్లు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Exit mobile version