Site icon NTV Telugu

Pakistan: ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాక్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

Imran Khan

Imran Khan

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చాయి. ఇప్పటికే భద్రతాబలగాల కాల్పుల్లో 8 మంది మరణించారు. మరోవైపు ఖైబర్ ఫక్తుంఖ్వా, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సుల్లో శాంతిభద్రతలను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.

Read Also: Pre-wedding shoots: ప్రీ వెడ్డింగ్ షూట్స్ అమ్మాయిలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారించబోతోంది. ఈ నేపథ్యంలో పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గంట లోపు ఇమ్రాన ఖాన్ ను తమ ముందర హాజరపరచాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ (ఎన్ఏబీ)ని ఆదేశించింది. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఎన్ఏబీ రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్ కోర్టు ముందు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. తర్వాతి రోజు కోర్టు అతనికి 8 రోజుల రిమాండ్ విధించింది.

మరోవైపు ఇమ్రాన్ అరెస్ట్ తో పాక్ అట్టుడుకుతోంది. ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, ఆర్మీ కంటోన్మెట్లే లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, క్వెట్టా, పెషావర్ వంటి ప్రావిన్షియల్ రాజధానుల్లో కూడా ఆందోళనలు మిన్నంటాయి. పీటీఐ కీలక నేత, మాజీ విదేశాంగ మంత్రి షామహమూద్ ఖురేషీని అధికారులు అరెస్ట్ చేశారు. వేలాది మంది పీటీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version