Site icon NTV Telugu

Supersonic Missile: పాకిస్థాన్‌లోకి దూసుకెళ్లిన భారత మిస్సైల్.. మిస్‌ఫైర్ అయిందంటున్న ఇండియా

పాకిస్తాన్​భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్​పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. ఇటీవల భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. మార్చి 9న సాయంత్రం 6:43 గంటలకు భారత క్షిపణి తమ భూభాగంలోని మియా చన్ను ప్రాంతంలో పడిందని పాకిస్థాన్ తెలిపింది. ప్రాణ నష్టం జరగకపోయినా ఓ గోడ కూలిపోయిందని పాకిస్థాన్ ప్రభుత్వం వివరించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని భారత రక్షణ శాఖను ఆ దేశం కోరింది.

అయితే దీనిపై భారత రక్షణ శాఖ శుక్రవారం నాడు స్పందించింది. సాంకేతిక లోపం వల్లే భారత మిస్సైల్ పాకిస్థాన్ భూభాగంపైకి వెళ్లిందని పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతామని వెల్లడించింది. ఈ ఘటన చాలా విచారకరమని.. ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని భారత అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version