Supermassive Black Hole: ఈ అనంత విశ్వంలో ఇప్పటి వరకు అంతుబట్టని విషయాల్లో బ్లాక్ హోల్ ఒకటి. మన శాస్త్రవేత్తలు విశ్వం గురించి తెలుసుకున్నది కేవలం కొంతమాత్రమే. ఇప్పటికే అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ బ్రహ్మాండం తనలో దాచుకుంది. బ్లాక్ హోల్స్ ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. నక్షత్రాల కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటూ.. సమీపంలోని నక్షత్రాలను, గ్రహాలను తనలో కలిపేసుకుంటూ అంతకంతకు పెద్దదిగా మారుతుంది. చివరకు సెకన్ కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి కూడా ఈ బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోలేదు. అంత బలమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి.
Read Also: Pakistan Economic Crisis: ప్రాణాలు కాపాడే మందుల కోసం అల్లాడుతున్న పాకిస్తాన్..
సూర్యుడిని నింపాలంటే 3.3 లక్షల భూమిలు అవసరం. అంత పెద్దగా సూర్యుడు ఉంటాడు. అయితే ఇలాంటి సూర్యుడితో పోలిస్తే దాదాపుగా 33 బిలియన్ రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్ ను తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద బ్లాక్ హోల్స్ లో పెద్దదని డర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను పేర్కొన్నారు. రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నర్ లో దీని గురించి ప్రచురించారు. PBC J2333.9-2343 అనే గెలాక్సీ మధ్యలో ఉన్న ఈ భారీ బ్లాక్ హోల్ ను గుర్తించారు. మన మిల్కీవే గెలాక్సీలో కూడా భారీగా ఉన్న బ్లాక్ హోల్స్ ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మిల్కీవే గెలాక్సీ మధ్యలో అతిపెద్ద బ్లాక్ హోల్ ను కనుగొన్నారు.
గ్రావిటీ లెన్సింగ్ ను ఉపయోగించి ఈ బ్లాక్ హోల్ ను గుర్తించారు శాస్త్రవేత్తలు. తాజాగా గుర్తించి బ్లాక్ హోల్ చాలా చురుకుగా ఉందని, తన సమీపంలోని పదార్థాన్ని లాగేసుకుంటున్నట్లు గుర్తించారు. కాంతి, ఎక్స్ కిరణాలు, ఇతర రేడియేషన్ రూపంలో శక్తిని విశ్వంలోకి వెదజల్లుతోంది. ఇలాంటి మాసీవ్ బ్లాక్ హోల్స్ చాలా అరుదు అని శాస్త్రవేత్తల చెబుతున్నారు. విశ్వం ప్రారంభ సమయంలో గెలాక్సీలు ఒకదానిలో ఒకటి కలిసే సమయంలో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.