Sun In Middle Age: మనకు వెలుగునిచ్చి, శక్తిని ఇచ్చి.. సౌరమండలానికి కీలకమైన సూర్యుడు ప్రస్తుతం నడి వయస్సుకు చేరుకున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనల్లో తేలింది. సూర్యుడు ఏర్పడి ఇప్పటి వరకు 4.57 బిలియన్ సంవత్సరాలు అయింది. సూర్యుడిపై ఇటీవల కాలంలో సౌరజ్వాలలు, బ్లాక్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి నడి వయస్సు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. దీని కారణంగానే గత రెండు వారాల కాలంగా సూర్యుడి వాతావరణం మరింత క్రియాశీలకంగా మారుతోంది. విశ్వంలోని వివిధ నక్షత్రాల జీవితకాలాన్ని అంచనావేసే గియా అంతరిక్ష నౌక పంపిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలిపారు.
సూర్యుడు తనలోని న్యూక్లియస్ ఫ్యూజన్ చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును హీలియంగా మారుస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తాడు. అయితే సూర్యుడిలో సెకన్ లో కొన్ని కోట్ల టన్నుల ఇంధనం ఈ చర్య ద్వారా మారుతుండటంతో అపరమిత శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల సోలార్ సిస్టమ్స్ లోని గ్రహాలకు శక్తి లభిస్తుంది. ఇదిలా ఉంటే కొన్నేళ్ల తరువాత సూర్యుడిలో పూర్తిగా హైడ్రోజన్, హీలియం అడుగంటుకుపోతాయి.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మపై నెటిజన్‌ల ఫైర్.. జాతీయ జెండాను అవమానించాడంటూ చీవాట్లు
సూర్యుడిలో శక్తి జనింప చేసే హైడ్రోజన్ అయిపోతే మరణించే స్థితికి వెళ్లిపోతాడు. సూర్యుడి కోర్ లో హైడ్రోజన్ తగ్గిపోయిన తర్వాత సూర్యుడు ఎర్రని సూపర్ జెయింట్ గా మారుతాడు. తన పరిమాణాన్ని ఊహించని రీతిలో పెంచుకుంటూ పోతాడు. ఈ పరిస్థితి ఏదో ఓ సమయంలో అన్ని నక్షత్రాలకు రావాల్సిందే. అయితే సూర్యుడు కూడా మరో 7-8 బిలియన్ ఏళ్ల తరువాత రెడ్ జాయింట్ స్థితిని పొందుతాడు. ఇప్పుడు ఉన్న సూర్యుడి పరిమాణం అనూహ్యంగా భూమిని దాటుకుని పెరుగుతుంది. అంతర గ్రహాలు అయిన బుధుడు, శుక్రుడు, భూమిని సూర్యుడే కబళిస్తాడు. ఆ తరువాత సూర్యుడి లాంటి చిన్న నక్షత్రాలు రెడ్ సూపర్ జెయింట్ నుంచి ప్లానెటరీ నెబ్యులాగా .. ఆ తరువాత చల్లబడుతూ తెల్లని మరగుజ్జు నక్షత్రంగా.. ఆ తరువాత పూర్తిగా శక్తి కోల్పోయి బ్లాక్ మరగుజ్జు నక్షత్రంగా మారుతాడు.
