కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న రిసార్ట్ బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఒక యువకుడితో కలిసి చాలా క్లోజ్‌గా బీచ్‌లోకి నడుచుకుంటూ వెళ్లింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో బీచ్‌లో కొట్టుకుపోయిందని తేల్చిచెప్పారు. అయితే పోలీసుల వాదనను సుదీక్ష తల్లిదండ్రులు కొట్టిపారేశారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని వాదించారు.
తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. లేదంటే సుదీక్షకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి మనసు కలత చెందిందో.. ఏమో తెలియదు గానీ… పేరెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా డొమినికన్ రిపబ్లిక్ అధికారులకు తల్లిదండ్రులు ఒక లేఖ రాశారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అంతేకాకుండా అమెరికా మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. సుదీక్ష చనిపోయినట్లుగా ప్రకటించాలని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులను తల్లిదండ్రులు కోరారు. తమ కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని.. పోలీసుల దర్యాప్తును పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అవసరమైన ఏవైనా లాంఛనాలు లేదా డాక్యుమెంటేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇక సుదీక్ష తల్లిదండ్రులు రాసిన లేఖ తమకు అందినట్లుగా పోలీసులు కూడా మంగళవారం నిర్ధారించారు.
అసలేం జరిగిందంటే..
మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా సుదీక్ష మాయం అయింది. అయితే ఈ విషయాన్ని స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవలతో జల్లెడ పట్టారు. కానీ నేటికి ఆమె అడ్రస్ దొరకలేదు. దీంతో రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఉన్న వీడియోలను పరిశీలించగా.. ఆమె రిసార్ట్ నుంచి ఒక యువకుడు జాషువా రీబేతో బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. బీచ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే ఒక అల రావడంతో పడిపోయామని.. తాను బయటకు వచ్చేశాను.. ఆమె కూడా వచ్చేసిందని పేర్కొ్న్నాడు. అనంతరం ఆమె నీళ్లు మింగడంతో వాంతు చేసుకున్నట్లు జాషువా రీబే చెప్పాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయినట్లు తెలిపాడు. అనంతరం ఆమె ఏమైందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకుండా అబ్జర్వేషన్‌లో ఉంచారు.
తాజాగా అధికారులు మరిన్ని వీడియోలను పరిశీలించారు. బార్‌లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో కలిసి ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో జాషువా రీబేతో కాకుండా మరొక సీనియర్ విద్యార్థితో కలిసి మద్యం సేవించినట్లుగా కనిపించింది. అంతేకాకుండా అతడితో చాలా సేపు ముచ్చట్లు పెట్టింది. అంతేకాకుండా అతడికి మద్యం అందించినట్లుగా కనిపిస్తోంది. అనంతరం ఇద్దరూ మద్యం సేవిస్తూ.. ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జాషువా రీబే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడి పాస్‌పోర్టు జప్తు చేశారు. అయితే విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు.
ఇక సుదీక్ష అమెరికా పౌరురాలి కాబట్టి.. అమెరికా అధికారులు.. డొమినికన్ రిపబ్లిక్ అధికారులతో కలిసి సెర్చ్ చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులు మాత్రం ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని తేల్చేశారు. కానీ అందుకు సుదీక్ష తల్లిదండ్రులు అంగీకరించలేదు. కచ్చితంగా తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. ఒక వేళ బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే.. కచ్చితంగా శవమైన కొట్టుకు వచ్చేదని తెలిపారు. చివరికి అధికారుల వాదనకే సుదీక్ష తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.