NTV Telugu Site icon

Bangladesh: ఖలీఫా రాజ్యం రావాలి..ఐసిస్ తరహా జెండాతో స్టూడెంట్స్ నిరసన.. మరో పాక్‌లా బంగ్లాదేశ్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా రిజర్వేషన్ హింసాత్మక అల్లర్ల సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ జైళ్లలో ఉన్న తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రిలీజ్ చేస్తున్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధం ఎత్తివేశారు.

Read Also: Israel-Labnon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి

తాజాగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాలేజ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) జెండాతో ర్యాలీ చేశారు. ఢాకాలోని ప్రముఖ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియాలో హిందూమత గురువు మహ్మద్ ప్రవక్తని అవమానించాడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరింతా నిరసన తెలిపారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ కాలిఫేట్, ఖలీఫా రాజ్యం రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ‘‘హిజ్బుల్ తెహ్రీర్’’ నిర్వహించింది. దీని లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కాలిఫేట్ రాజ్యం తీసుకురావడం. హిజ్బుత్ తెహ్రీర్‌ని బంగ్లాదేశ్ 2009లో బ్యాన్ చేసింది. అయితే, ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిజ్బుత్ తెహ్రీర్‌పై బ్యాన్ ఎత్తివేయాలని, దాని లీడర్ మహఫుజ్ ఆలం మహ్మద్ యూనస్‌ని కోరుతున్నారు. హిజ్బుత్ తెహ్రీర్‌ని గతవారం భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.