Site icon NTV Telugu

డ్రాగ‌న్ ఆయుధాల‌కు త‌గ్గిన గిరాకీ… ఇదే కార‌ణం…

ప్ర‌చ్చ‌న్న‌ యుద్ధం త‌రువాత ర‌ష్యా ప్ర‌భావం త‌గ్గిపోవ‌డంతో చైనా బ‌లం పుంజుకుంది.  ఆర్ధికంగా, ర‌క్ష‌ణ ప‌రంగా బ‌లం పెంచుకుంది.  ఒక‌ప్పుడు ఆయుధాల‌పై ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డిన డ్రాగ‌న్ ఇప్పుడు ఇత‌ర దేశాల‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే స్థాయికి ఎదిగింది.  గ‌త కొంత‌కాలంగా చైనా అనుస‌రిస్తున్న విధానం, దూకుడు, స‌రిహ‌ద్దు దేశాల‌తో వివాదాలు క‌లిగి ఉండ‌త‌టం, క‌రోనా మ‌హ‌మ్మారికి చైనానే కార‌ణ‌మ‌ని అగ్ర‌దేశం అమెరికాతో స‌హా వివిధ దేశాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం చైనా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌పై ప‌డింది.  చైనా త‌యారు చేస్తున్న ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసేందుకు దేశాలు ముందుకు రావ‌డంలేదు.  

Read: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న “లైగర్” బ్యూటీ…!!

గ‌డిచిన రెండు ద‌శాబ్దాల కాలంలో చైనా కేవ‌లం 7.2 బిలియ‌న్ డాల‌ర్ల ఆయుధాల‌ను మాత్ర‌మే ఎగుమ‌తి చేసింది.  పాక్‌, ఉత్త‌ర కొరియా లాంటి కొన్ని దేశాలు మిన‌హా మిగ‌తా దేశాల‌న్ని చైనాపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి.  పాక్ త‌న‌కు అవసరమైన ఆయుధాల్లో 74 శాతం చైనా నుంచి దిగుమ‌తి చేసుకుంటోంది.  ఇక, గ‌తంలో ఆయుధాల‌కోసం ఇత‌ర దేశాల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డే ఇండియా, ఆత్మ‌నిర్భ‌ర్ లో భాగంగా సొంతంగా ఆయుధాల‌ను త‌యారు చేసుకోవ‌డం మొదలు పెట్టింది.  దీంతో ఆయుధాల దిగుమ‌తి దాదాపుగా 33 శాతం వ‌ర‌కు త‌గ్గిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

Exit mobile version