NTV Telugu Site icon

Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం..

Amazon

Amazon

Porn addiction: ప్రపంచంలో దట్టమైన అడవి, ఒక్కసారి ఆ అడవిలోకి ప్రవేశిస్తే తప్పిపోవడం ఖాయం. నదులు, అనకొండలు, అనేక జీవజాలానికి నిలయం ‘‘అమెజాన్’’ అడవి. ఇప్పటికీ చాలా తెగలు ఈ అడవిలో మారుమూల ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని ఈ తెగలు, ఇప్పటికీ తమ సంస్కృతిపై బయటి ప్రభావం పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాయి. ఎన్నో సంఘర్షణలు, యుద్దాలు వచ్చిన అమెజాన్‌లోని ‘‘ మారుబో తెగ’’ని ఏదీ తాకలేదు. అయితే, ప్రస్తుతం వీరు అశ్లీలతకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ తెగలో ‘‘పోర్న్’’కి బానిసలుగా మారిపోతున్నారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

కేవలం పోర్న్ వీడియోలు మాత్రమే కాకుండా, ఇంటర్నెట్ కూడా యువకులను వీడియో గేమ్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌కి కట్టిపడేస్తోంది. దీనిపై ఆ తెగ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా నివసిస్తున్న 26 గిరిజన తెగల్లో 19 జవారీ లోయలో నివసిస్తున్నాయి. ప్రపంచంలో ఏకాంతంగా నివసించే తెగలుగా వీటికి పేరుంది. మారుబో తెగ ఉంది, అయితే వీరు మొదటగా అటవీ వెలుపలకు వచ్చారు. ఈ తెగలోనే సెబాస్టి కుటుంబం ఉంది, ఇతని కుమారుడు ఎనోక్ తర్వాతి తెగ నాయకుడు. ఇతనే తెగ ఇంటర్నెట్ పొందేలా చేశాడు.

Read Also: Chilkur Temple: శని, ఆదివారాలు చిలుకూరు గుడి క్లోజ్ అంటూ చూపిస్తున్న గూగుల్.. స్పందించిన పూజారి..

ఇలా ఇంటర్నెట్ రావడంతో తెగలోని చాలా మంది పోర్న్‌ వీడియోలకు బానిసలుగా మారుతున్నారు. దీనికి అంతటికి కారణం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. మస్క్‌కి చెందిన స్టార్ లింక్ ద్వారా నేరుగా శాటిలైట్- ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తున్నారు. దీంతో ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండా, ఎలాంటి మారుమూల ప్రాంతంలో అయిన ఇంటర్నెట్ ప్రాప్యతను పొందొచ్చు. నేరుగా శాటిలైన్ నుంచి చిన్న యాంటెన్నా ద్వారా ఇంటర్నెట్ పొందొచ్చు. దీంతో మారుమూల అమెజాన్ అడవుల్లో పలు గిరిజన తెగలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించింది.

బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో 2022లో అమెజాన్‌లో స్టార్ లింక్ రాక గురించి ప్రకటించారు. ఆ తర్వాత వేగంగా ఇంటర్నెట్, మొబైల్స్ ఇలా గిరిజనులకు చేరాయి. ఇది అక్కడి డైలీ రొటీన్ పనుల్ని ప్రభావితం చేసింది. అడవుల్లో వేట, చేపలు పట్టకుంటే రోజు గడవదు. ఇలాంటి వాటిని ఇంటర్నెట్ దెబ్బతీసింది. దీంతో ఇంటర్నెట్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని నాయకులు గ్రహించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉదయం రెండు గంటలు, సాయంత్రం 5 గంటలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వ్యవధిలోనే చాలా మంది యువత ఫోన్‌కి అంకితమవుతున్నారు. చాలా మంది వాట్సా్ప్ ద్వారా తమ కుటుంబాలతో మాట్లాడుకుంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం పోర్న్ వీడియోలు తెగ చూస్తున్నారని, కొన్ని సందర్భాల్లో సెక్స్ విషయంలో విపరీత ప్రవర్తనను కూడా గమనించినట్లు తెగ పెద్దలు చెబుతున్నారు. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.