NTV Telugu Site icon

Sri Lanka: 9 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక

Srilankannavyarrests

Srilankannavyarrests

సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దు దాటిన తొమ్మిది మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మత్స్యకారులను కంగేసంతురై నేవల్ క్యాంపునకు తరలించారు.

ఇది కూడా చదవండి: CID investigation on Liquor Scam: మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

రామేశ్వరానికి చెందిన మత్స్యకారుల బృందం సోమవారం 430 బోట్లలో అవసరమైన అనుమతి పొంది చేపల వేటకు వెళ్లారు. అయితే వారు నెడుంతీవు సమీపంలో చేపలు పట్టే సమయంలో శ్రీలంక నావికాదళం వారిని చుట్టుముట్టడంతో  చెల్లాచెదురు అయిపోయారు. కచ్చతీవు సమీపంలోని మత్స్యకారులను వెంబడించి పడవను ధ్వంసం చేశారు. మరో ఫిషింగ్ బోటును లంక నౌకాదళం ఢీకొట్టడంతో అది ధ్వంసమైంది. రెండు బోట్లలో చేపల వేట సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐజాక్ రాబిన్, సెల్వకుమార్‌లకు చెందిన రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఓడలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులను అంతర్జాతీయ సరిహద్దు దాటినందుకు అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ పేర్కొంది. అరెస్టు చేసిన మత్స్యకారులను కంగేసంతురై నేవల్ క్యాంప్‌కు తరలించారు. అనంతరం జాఫ్నా ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు. విచారణ తర్వాత జైలుకు పంపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని భారతీయ మత్స్యకారులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: CID investigation on Liquor Scam: మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..