Site icon NTV Telugu

Srilanka: అంధకారంలో శ్రీలంక దేశం.. సిస్టమ్ ఫెయిల్యూర్‌తో విద్యుత్ అంతరాయం..

Sri Lanka

Sri Lanka

Sri lanka: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ద్వీపదేశం శ్రీలంక, ఇప్పుడు కరెంట్ కష్టాలను ఎదుర్కొంటోంది. విద్యత్ సిస్టమ్ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్ లేకుండా పోయింది. శ్రీలంక మొత్తం అంధకారంలో ఉంది. దేశంలోని విద్యుత్ గుత్తాధిపత్య సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తోందని సిఇబి ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. వ్యవస్థ వైఫల్యం కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిందని ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఒక్కసారి దేశవ్యాప్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Big Breaking: మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం..

2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇంధనం, మెడిసిన్స్, ఆహారపదార్థాలు ఇలా అన్నింటికి కొరత ఏర్పడింది. విదేశీమారక నిల్వల కొరత కారణంగా ఇంధన రవాణాకు కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. రోజుకు 10 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఇటీవల ఈ కోతల్ని 13 గంటలకు పొడగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం కారణంగా అక్కడి ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version