Site icon NTV Telugu

Spotify: టెక్ లేఆఫ్ జాబితాలోకి మరో కంపెనీ.. ఉద్యోగుల తొలగించే యోచనలో స్పాటిఫై

Spotify

Spotify

Spotify To Begin Laying Off: టెక్ లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటిస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ స్పాటిఫై కూడా తమ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలో తొలగింపులు ఉండవచ్చని ప్రకటించింది. అక్టోబర్ నెలలో స్పాటిఫై గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్ కాస్ట్ స్టూడియోల నుంచి 38 మందిని, సెప్టెంబర్ నెలలో ఎడిటోరియల్ ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంత మందిని తీసేస్తుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

Read Also: Apple Company: iPhone లేటెస్ట్‌ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా

మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై ప్రస్తుం 9800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే స్పాటిఫై ఆదాయం ఇటీవల కాలంలో తగ్గింది. దీంతో ఖర్చులను అదుపు చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులను తీసేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది షేర్ల 66 శాతం పడిపోయాయి. టెక్ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపులో స్పాటిఫై మొదటది కాదు.. అలాగని చివరిది కాదు. వచ్చే కొన్ని రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

గతవారం చివర్లో గూగుల్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి నెలలో సగటున రోజుకు 3000 మంది ఉద్యోగాలను కోల్పోతారని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాలతో, ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

Exit mobile version